ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఐకాస నేతలు మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమై చర్చిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికుల అభిప్రాయాలను యూనియన్ నేతలు సేకరిస్తున్నారు. 46 రోజుల సమ్మెలో ఎలాంటి పోరాటాలు చేశాం, ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొన్నాం, కోర్టు చెప్పిన అంశాలు తదితర అంశాలను యూనియన్ నేతలు కార్మికులకు వివరిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో కార్మికుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, లేబర్ కోర్టులో తేలడానికి చాలా సమయం పడుతుందని ఈ సమయంలో సమ్మెను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న ప్రస్తావన వచ్చింది. మరికొంతమంది ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించాలని యూనియన్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ సాయంత్రానికి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
సమ్మెపై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనున్న ఆర్టీసీ ఐకాస - all rtc unions meeting started at lb nagar to decide on strike
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయా సంఘాల నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమై చర్చిస్తున్నారు. మెుత్తానికి సమ్మెపై నేడు ఆర్టీసీ ఐకాస తుది నిర్ణయం తీసుకోనుంది.
సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఐకాస
ఇదీ చూడండి: చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు
Last Updated : Nov 19, 2019, 5:13 PM IST