Food Poison: జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులోని బీసీ గురుకుల పాఠశాలలో ఉగాది పచ్చడి తాగి 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఇప్పుడు పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని తల్లిదండ్రులు ఉగాది పచ్చడిని తెచ్చారు. శనివారం సాయంత్రం అది తాగిన ఐదో తరగతికి చెందిన 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులందరినీ హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.