తెలంగాణ

telangana

ETV Bharat / city

'అంకితభావంతో విధులు నిర్వహించాలి' - police training completed

కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందిన 250 మంది కానిస్టేబుళ్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​ కార్యక్రమం జరిగింది. పోలీసు శాఖలో ఉద్యోగం లభించడం అదృష్టమని సీపీటీసీ ప్రిన్సిపల్ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.

కానిస్టేబుళ్ల అవుటింగ్​ పరేడ్​ కార్యక్రమం
కానిస్టేబుళ్ల అవుటింగ్​ పరేడ్​ కార్యక్రమంకానిస్టేబుళ్ల అవుటింగ్​ పరేడ్​ కార్యక్రమం

By

Published : Oct 8, 2020, 7:35 PM IST

ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా ఉండి అంకితభావంతో విధులు కొనసాగించాలని సీపీటీసీ ప్రిన్సిపల్ ఎస్.శ్రీనివాస్ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు సూచించారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందిన 250 మంది కానిస్టేబుళ్ల పాసింగ్​ అవుట్​​ పరేడ్​ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్​... ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రభుత్వ శాఖల్లో ఒకటైన పోలీసు శాఖలో ఉద్యోగం లభించడం అదృష్టమని తెలిపారు. విధినిర్వహణపైనే దృష్టి కేంద్రీకరించినట్లయితే ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రజలకు సేవలందిస్తూ ఫలితాలను సాధించవచ్చని సూచించారు.

కానిస్టేబుళ్ల అవుటింగ్​ పరేడ్​ కార్యక్రమం

ఇదీ చూడండి: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు!

ABOUT THE AUTHOR

...view details