తెలంగాణ

telangana

ETV Bharat / city

'12 ఈవీఎంలతో పోలింగ్​ సజావుగా జరిగేనా'

నిజామాబాద్​ నియోజకవర్గం దేశాన్ని తన వైపు తిప్పుకుంది. అక్కడ పోలింగ్​ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ చర్రితలోనే మొదటిసారిగా 12 ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించనున్నారు. 185 మంది పోటీ చేస్తున్న ఇక్కడ ఎన్నికల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జగిత్యాలలో నమూనా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు  చేశారు. ఓటు వేయడం తికమకగా ఉందని... సమయం బాగా తీసుకుంటుందని ఓటర్లు అంటున్నారు. 11న ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటో చూడాలి.

నమూనా పోలింగ్​లో మహిళ

By

Published : Apr 6, 2019, 8:10 PM IST

Updated : Apr 7, 2019, 6:28 AM IST

రైతులు తమ సమస్యలు దేశానికి తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం 178 మంది అన్నదాతలు లోక్​సభ ఎన్నిక బరిలో నిలిచారు. దేశాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలుపుకుని మొత్తం 185 మంది పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల పోలింగ్​పై ఉత్కంఠ నెలకొంది.

186 గుర్తులు

ఇక్కడ నోటాతో కలుపుకుని మొత్తం 186 గుర్తులు ఉండగా.. ఓటర్లు చిహ్నాలను గుర్తించడం కష్టమే. అందుకే ముందుగానే జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు 12 ఈవీఎంలతో కూడిన నమూనా పోలింగ్‌ కేంద్రాన్ని ఈ నెల 4న రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్‌ బుద్ధ ప్రకాశ్‌, కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్‌కుమార్‌ జగిత్యాలలో ప్రారంభించారు.

ఓటర్ల తికమక

నమూనా పోలింగ్‌ కేంద్రానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటు వేయడానికి కనీసం 2 నుంచి 3 నిమిషాలు సమయం పడుతోంది.. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లాక.. గుర్తులను చూసేందుకు ఓటరు కొంత తికమక పడుతూ ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు.

'12 ఈవీఎంలతో పోలింగ్​ సజావుగా జరిగేనా'
గత రెండు రోజులుగా మాక్ ఓటింగ్​ తీరు చూస్తే గంటకు 20 నుంచి 30 ఓట్లు మాత్రమే వేయగలుతున్నారు. ఇదే విధానంలో పోలింగ్ రోజు గంట సమయం పెంచినా ఎన్నిక ఎలా జరుతుందో సందేహమే. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 7 వందల నుంచి 11 వందలకుపైగా ఓట్లు ఉండే అవకాశం ఉంది. సమయం ఎక్కువ తీసుకోవటం వల్ల 11 గంటల్లో కేవలం 330 మంది ఓటు వేసే అవకాశం ఉంటుందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మండుతున్న ఎండలు

దీనికి తోడు ఉదయం పది తర్వాత 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఎండ వేడిమికి ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో ఎంత సేపు నిలుచుంటారనే సందేహం ఉంది. గత మూడు రోజుల పరిశీలనతో నిరాక్షరాస్యులు కొంత సమమం తీసుకుంటున్నారని. చదువుకున్న వారు త్వరగానే ఓటు వేస్తున్నారని.. ముందుగానే గుర్తులను, నంబర్లను వివరిస్తున్నామని జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ చెప్పుతున్నారు. అందరి చూపు నిజామాబాద్‌ వైపు చూస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో చూడాలి మరి. ఇవీ చూడండి: ఉగాది సంబురాల్లో భాజపా నేతలు

Last Updated : Apr 7, 2019, 6:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details