ETV Bharat / city
బస్సు రాలేదని మంత్రికి ఎస్‌ఎంఎస్.. అధికారుల పరుగులు - mantri
సమయానికి బస్సు రాలేదని ఓ ప్రయాణికుడు చేసిన ఎస్ఎంఎస్కు రవాణా శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. మంత్రి విచారణకు ఆదేశించడం.. జగిత్యాల డిపోలో అధికారులను పరుగులు పెట్టించింది. విచారణ జరిపిన అధికారులు... ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రయాణికుడి ఎస్ఎంఎస్తో స్పందించిన మంత్రి
By
Published : Mar 25, 2019, 7:05 PM IST
| Updated : Mar 25, 2019, 7:47 PM IST
ప్రయాణికుడి ఎస్ఎంఎస్తో స్పందించిన మంత్రి రిజర్వేషన్ చేసుకున్న బస్సు సమయానికి రాలేదనిఓ ప్రయాణికుడు.. ఆగ్రహించి సదరు మంత్రికి ఎస్‌ఎంఎస్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన అరవింద్ అనే ప్రయాణికుడు అహ్మదాబాద్ నుంచి ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అప్పటికే అతను జగిత్యాల డిపోకు చెందిన బస్సులో కరీంనగర్ చేరుకునేందుకు రిజర్వేషన్ చేసుకున్నాడు. పదిన్నరకు రావాల్సిన బస్సు సమయానికి రాకపోగా.. అక్కడ ఎవరూ అధికారులు లేక పోవడం చూసి... మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎస్‌ఎంఎస్ చేశాడు. జగిత్యాల డిపోలో అధికారుల విచారణ వెంటనే స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు ప్రయాణికుల కోసం రాజేంద్రనగర్ డిపోకు చెందిన బస్సును వెంటనే ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపారు. బ్యాటరీ ఫెయిల్.. పనిచేయని సెల్ఫ్... అనంతరం బస్సు ఆలస్యంపై డిపోలో అధికారులు విచారణ జరిపారు. బ్యాటరీ దిగిపోయి బస్సు సెల్ఫ్ పనిచేయక.. బస్సు పంపలేదని విచారణలో తేలింది. ఈ నివేదికను మంత్రికి పంపుతున్నారు. పూర్తి నివేదిక సిద్ధమయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగిత్యాల డిపో మేనేజరు జగదీశ్వర్ తెలిపారు. మొత్తానికి మంత్రిగారికి పంపిన ఓ ఎస్ఎంఎస్తో అధికారులు నిద్రలేచారు. అదే మెసేజ్ లేకుంటే.. ప్రయాణికుల సమస్య ఎప్పటికి తీరేదో మనకు తెలియంది కాదు. Last Updated : Mar 25, 2019, 7:47 PM IST