తెలంగాణ

telangana

ETV Bharat / city

తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: సుబ్బారెడ్డి - శ్రీవారి భూముల విక్రయ వివాద వార్తలు

ఇక నుంచి తితిదే ఆస్తులు, భక్తుల కానుకలు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించమని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ttd
సుబ్బారెడ్డి

By

Published : May 28, 2020, 4:56 PM IST

తితిదే ఆస్తుల విక్రయిస్తున్నారనే ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని... పాలకమండలి కోరుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. మరోసారి తితిదే ఆస్తులపై ఆరోపణలు రాకుండా చూడాలన్నారు. తితిదే ఆస్తులపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని, డొనేషన్ స్కీమ్​లోనూ అర్హులకే ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేస్తామన్నారు.

  • నిబంధనలు సడలించాకే దర్శనం

లాక్​డౌన్ నిబంధనలు సడలించాక స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఏర్పాట్లు చేస్తామన్నారు. భౌతిక దూరం పాటించి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.

ఇది చదవండి: రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details