అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈసీని కలిశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్‌గా వాడుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ అనే పదాన్ని వాడకుండా చూడాలని ఈసీని కోరినట్లు మహబూబ్‌బాషా తెలిపారు. వైఎస్సార్ అనే పదంతో నమోదైన ఏకైక పార్టీ అన్న వైఎస్సార్ పార్టీ ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. వైకాపా వారి అధికార పత్రాలపై పూర్తి పేరు వాడకుండా వైఎస్సార్ అని రాయడంపై తమ అభ్యంతరం అని తెలిపారు. ఇటీవల ఓ ఎంపీకి ఇచ్చిన షోకాజు నోటీసులో వైఎస్సార్ అని రాయడంతో తమ పార్టీనే అని అనుకుంటున్నారని మహబూబా బాషా అన్నారు. వైఎస్సార్ అనే పదం ఇతర వేరే పార్టీలు వాడకూడదని ఎస్ఈసీ గతంలోనే చెప్పిందని ఆయన గుర్తుచేశారు.
నా పార్టీ పేరును వైకాపా వాడుకుంటోంది: మహబూబ్ బాషా - అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా
అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా దిల్లీలో ఈసీని కలిశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్‌గా వాడుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అసలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదే అని చెబుతున్నారు
ysrcp
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈపేరును ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానంగా లేఖ రాసిన ఆయన.. ఈ అంశాన్ని ప్రస్తావించారు.