Yuva Telangana party merged with BJP: నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం కేసీఆర్‌ను.. గద్దె దించడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని యువ తెలంగాణ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ పేర్కొన్నా రు. అందుకే తమ పార్టీని భాజపాలో విలీనం చేసినట్లు తెలిపారు. దిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో... కాషాయ కండువా కప్పుకున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. అందుకు యువ తెలంగాణ పార్టీ విలీనమే నిదర్శమని తెలిపారు. జాతీయస్థాయిలో వార్తల్లో ఉండేందుకే సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
"సర్జికల్ స్ట్రైక్ విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పని కేసీఆర్ ఒప్పుకోవాలి. తన పుట్టినరోజున కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ గెలిస్తే తెరాస గెలిచినట్లే. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలి. తెరాస, కాంగ్రెస్ రెండూ కలిసే పనిచేస్తాయని భావించినందునే.. యువ తెలంగాణ పార్టీ భాజపాలో విలీనమైంది."
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు