తెలంగాణ

telangana

ETV Bharat / city

గోవుతల్లి గోసపడుతోంది.. దాతల కోసం ఎదురుచూపులు.. - బాటసింగారం గోమహాక్షేత్రంలో ఆవుల అవస్థ

Yugatulasi Foundation News: శాశ్వత ఆవాసాలు లేకపోవడంతో చిన్న చినుకు పడితే బురదమయంగా మారిపోయి తలదాచుకోవడానికి వీల్లేని పరిస్థితి. సరిపడా పశుగ్రాసం లేక.. చలికి వణుకుతూ.. ఎండకు ఎండుతూ వందల సంఖ్యలో మూగజీవాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. బాటసింగారం గోమహాక్షేత్రంలో ఉన్న మూగజీవాలా వేదన ఇది. ఈ పరిస్థితుల్లో దాతల సాయం కోసం యుగతులసి ఫౌండేషన్‌ ఎదురుచూస్తుంది.

Yugatulasi Foundation
Yugatulasi Foundation

By

Published : Aug 3, 2022, 8:26 AM IST

Yugatulasi Foundation News: చినుకు పడితే బురదమయంగా మారిపోయే ప్రాంతం. శాశ్వత నిర్మాణాలు లేకపోవడంతో భారీ వర్షం వస్తే తలదాచుకోవడానికి వీల్లేని పరిస్థితి. సరిపడా దాణా లేక.. చలికి వణుకుతూ... ఎండకు ఎండుతూ వందల సంఖ్యలో మూగజీవాల వేదన. నగర శివారులోని బాటసింగారం దగ్గర ఏర్పాటుచేసిన గోమహా క్షేత్రంలోని పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల్లో కబేళాలకు తరలించే ఆవులను రక్షించాలనే తమ సదుద్దేశం నెరవేరడం లేదని యుగతులసి ఫౌండేషన్‌ ఆవేదన వ్యక్తంచేసింది. అక్రమంగా కబేళాలకుతరలించే గోవుల్ని రక్షించి ఆశ్రయం, ఆహారం అందించే లక్ష్యంతో జాఫర్‌గూడ, బాట సింగారం దగ్గర ఈ ఫౌండేషన్‌ 2021 జూన్‌లో గోమహాక్షేత్రం 8 గోవులతో ఆరంభమైంది. పరిమిత సంఖ్యలో జీవాలకు ఆశ్రయం కల్పించేలా ఫౌండేషన్‌ ప్రతినిధులు అప్పట్లో షెడ్లు నిర్మించారు. ఇటీవలి కాలంలో వాటి సంఖ్య 600లకు చేరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. షెడ్లు సరిపోవడం లేదు. గ్రాసం, దాణా కొరత తీవ్రమైంది.

భారీ వర్షాలతో కష్టాలు రెట్టింపు..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. క్షేత్రంలో నేల ఎగుడుదిగుడుగా ఉండడం, చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలుస్తుండటంతో ఆవులు అక్కడే నిలబడి వ్యాధుల బారినపడుతున్నాయి. ఈదురు గాలులకు తాత్కాలిక షెడ్లు కూలే స్థితికి చేరుకున్నాయి. దాణాలేక, సరైన సమయంలో వైద్యం అందక పదుల సంఖ్యలో గోవులు మృత్యువాత పడుతున్నాయని ఫౌండేషన్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ‘మా వంతుగా వాటికి ఆహారం, వైద్యం అందిస్తున్నాం. పూర్తిస్థాయిలో సేవలు అందించడం శక్తికి మించిన భారమైంది. గ్రాసం, వైద్యం తదితరాలు అందించేలా దాతల ముందుకొచ్చి సాయం అందిస్తే ఆవులనురక్షించడం సాధ్యమవుతుందని’ ఫౌండేషన్‌ పేర్కొంది. దాతలు 8008602588 నంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తోంది.

వనరులు ఉంటేనే కాపాడగలం..

'క్షేత్రంలోని తాత్కాలిక షెడ్ల స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. భూమి చదునుచేయడంతోపాటు ఫ్లోరింగ్‌ వేయాలి. పశుగ్రాసం, దాణాతోపాటూ గోవులకు వైద్యం అందించే వనరులు ఉండాలి. అందుకోసం దాతల సహకారాన్ని కోరుతున్నాం. గోవులకు నిరంతరం వైద్యం అందించేందుకు స్వచ్ఛందంగా పనిచేసే వైద్యులు, గో సేవకులు ముందుకురావాలి.'- కె.శివకుమార్‌, యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌

ABOUT THE AUTHOR

...view details