YS Sharmila Padayatra : తెలంగాణలో పాగా వేయడానికి, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
YS Sharmila Padayatra : మార్చి 11 నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం - తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర
YS Sharmila Padayatra : ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు వైతెపా అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈనెల 11 నుంచి పునఃప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న తాత్కాలికంగా వాయిదా పడిన ఈ యాత్రను పునఃప్రారంభించనున్నట్లు వైతెపా వర్గాలు వెల్లడించాయి.
YS Sharmila Padayatra Restarts : రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తెరాస ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్9న ఈ పాదయాత్ర వాయిదా పడింది.
YS Sharmila Padayatra in Telangana : ఈనెల 11 నుంచి ఈ పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు వైతెపా వర్గాలు వెల్లడించాయి. వైఎస్ షర్మిల.. మళ్లీ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల వద్దకు వెళ్తారని తెలిపారు. ప్రజాసమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిని ఎండగడతారని వెల్లడించారు.