తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎమ్మెల్యే సామాజికవర్గానికి ఎంపీపీ ఇవ్వొద్దు'! - ఎంపీపీ పదవులపై వైకాపా కీలక నిర్ణయం

ఏపీలో.. మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), ఉపాధ్యక్ష పదవులపై వైకాపా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వారికి ఎంపీపీ పదవి ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.

ysrcp, ys congress party
వైఎస్సార్​సీపీ, వైఎస్సార్ కాంగ్రెస్

By

Published : Apr 2, 2021, 10:18 AM IST

ఏపీలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), ఉపాధ్యక్ష పదవులను ఏ సామాజికవర్గాలకు కేటాయించాలనే దానిపై అధికార వైకాపా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వారికి ఎంపీపీ పదవి ఇవ్వకూడదని భావిస్తున్నారు. సంబంధిత మండలంలో ఎమ్మెల్యే సామాజికవర్గం తర్వాత అత్యధికంగా ఉండే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీపీ పదవి, మూడో ప్రభావిత సామాజికవర్గానికి ఉపాధ్యక్ష పదవిని కేటాయించాలని ఎమ్మెల్యేలకు అధిష్ఠానం స్పష్టం చేసినట్లు సమాచారం.

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభమైనందున ఎంపీపీలు, ఉపాధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఎమ్మెల్యేలు ముందుగానే నిర్ణయించుకునేందుకు వీలుగా సామాజికవర్గాల ప్రాధాన్యాన్ని వారికి స్పష్టం చేసినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. నగరపాలక సంస్థలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఛైర్మన్లు, ఉపాధ్యక్షుల విషయంలోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలుచేశారు. దాన్నే మండల పరిషత్‌ల విషయంలోనూ కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details