Cabinet reshuffle: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై ఏప్రిల్ 4 వరకు చర్చ ఉండకపోవచ్చని వైకాపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఏప్రిల్ 1న అమావాస్య కావడంతో అంతకుముందు.. కొత్తగా ఏ పని చేయరని, ఆ మరుసటి రోజు ఉగాది, తర్వాత రోజు ఆదివారం కావడంతో మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం లేకపోవచ్చు’ అని భావిస్తున్నారు. ఏప్రిల్ 4న గుంటూరు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్లకు నిర్వహించే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. అందువల్ల ఏప్రిల్ 4 తర్వాతే మంత్రిమండలిపై చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై అప్పటివరకు చర్చ లేనట్లే..! - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
YSRCP leaders on cabinet reshuffle: ఏపీ మంత్రి మండలి పునరుద్ధరణపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల 4 వరకు మంత్రిమండలి మార్పుపై చర్చ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్ 1న అమావాస్య కావడంతో అప్పటివరకు ఏ కొత్తపని చేయరని.. ఆ తర్వాత ఉగాది పండుగ, ఆదివారం రావడంతో పునరుద్ధరణపై చర్చించడం కుదరదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.
ముగ్గురే ఉంటారా? :ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో ముగ్గురిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సామాజికవర్గం పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ ముగ్గురిని కొనసాగించే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల్లో మహిళలు ముగ్గురుండగా.. కొత్త మంత్రివర్గంలో వీరి సంఖ్య 5కు పెరగనుందని తెలుస్తోంది. మరోవైపు శ్రీరామనవమికి కొత్త మంత్రిమండలి కొలిక్కి వస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ సీఎం కార్యాలయ వర్గాలు దాన్ని కొట్టి పారేస్తున్నాయి.
ఇదీ చదవండి:Paddy Procurement: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'