ysrcp rebal leaders: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మడిగుంటలో వైకాపా అసమ్మతివర్గం సమావేశమైంది. పార్టీ బలోపేతానికి కష్టపడిన తమను కరివేపాకులా తీసి పడేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన పాడేరు ఎమ్మెల్యే, అరకు ఎంపీ ఫలాలు అనుభవిస్తున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ సహా అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి టిక్కెట్ ఇస్తే ఓట్లు వేసేది లేదని స్పష్టం చేశారు. మరి ఈ విభేదాలపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ysrcp rebal leaders: వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. సిట్టింగులకు సీట్లిస్తే అంతే..! - వైకాపా అసమ్మతివర్గం సమావేశం
ysrcp rebal leaders: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వైకాపాలో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడితే.. తమను పట్టించుకోవడం లేదని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి అసమ్మతి వర్గమంతా సమావేశమై వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీలకు సీట్లు ఇస్తే సహకరించమని ఓట్లు వేసేది లేదని తీర్మానించుకున్నారు.
![ysrcp rebal leaders: వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. సిట్టింగులకు సీట్లిస్తే అంతే..! ysrcp rebal leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15600717-966-15600717-1655624145685.jpg)
వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు