‘పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ ఎంపీలు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. శాసనసభలో కండువాలు మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి తమ్మినేని సీతారాంకు లేఖ రాశా. కండువాలు మార్చి ముఖ్యమంత్రిపై పొగడ్తలు కురిపిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి’ అని ఏపీకి చెందిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో గురువారం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రికి ఇచ్చిన పిటిషన్‌లో అనర్హత వేటు అంశాన్ని 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు పేర్కొందని తమ ఎంపీలు తెలిపారని, తాము గడువులు పెట్టలేదని, పార్లమెంటులో చట్టాలు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. తనను దృష్టిలో ఉంచుకొని పదో షెడ్యూలుకు సవరణ పెట్టాలని సూచించారని, తాను ఎక్కడా ఆ షెడ్యూలును ఉల్లంఘించలేదని చెప్పారు. హైకోర్టును కర్నూలుకు మార్చాలని కేంద్రమంత్రిని కోరారని, ఆ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించడం న్యాయమే..