YS Viveka murder case : జైల్లో శివశంకర్‌రెడ్డిని కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు - YS Viveka murder case updates
YS Viveka murder case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కలిశారు. నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని ఎమ్మెల్యేలు జైల్లో కలవడం చర్చనీయాంశమైంది.
YS Viveka murder case : మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కడప జైల్లో కలిశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇద్దరు కలిసి.. కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో ములాకత్ అయ్యారు. అరగంట పాటు అతనితో మాట్లాడారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు శివశంకర్‌రెడ్డి భార్య కూడా ఆయనను కలిశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని ఎమ్మెల్యేలు జైల్లో కలవడం చర్చనీయాంశమైంది.