గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే వీడియో ద్వారా బుధవారం వెల్లడించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ రిపోర్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఉదయం తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్ రావటం ఆశ్ఛర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పాజిటివ్ వచ్చిందని తెలియగానే హోం క్వాంరటైన్కు వెళ్లినట్లు తెలిపారు. చాలామంది పార్టీ కార్యకర్తలు అభిమానులు ఫోన్లు చేస్తున్నారని... అందరి అభిమానంతో త్వరలోనే కోలుకుంటానని తెలిపాారు.