ఆంధ్రప్రదేశ్లో శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ధ్రువీకరించారు. ఆరు స్థానాలకు సోమవారంతో నామినేషన్ల గడువు ముగియగా.. ఆరుగురు మాత్రమే బరిలో నిలిచారు.
ఏపీ శాసనమండలికి ఆరుగురు వైకాపా నేతల ఏకగ్రీవం - శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు వైకాపా అభ్యర్థులు
ఏపీలో శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఆరు స్థానాలకు సోమవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. వైకాపా నుంచి ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ధ్రువీకరించారు. శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంను గెలిచినవారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఏపీ శాసనమండలికి ఆరుగురు వైకాపా నేతల ఏకగ్రీవం
అభ్యర్థులు.. దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నిసా, చల్లా భగీరథరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు అసెంబ్లీలో ఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రాలు సోమవారం స్వీకరించారు. వీరు అక్కడే ఉన్న శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలిశారు. మహమ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్య గెలుపు ధ్రువపత్రాలను తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చదవండి:ఎంపీ అరవింద్ గృహనిర్బంధం
TAGGED:
ఏపీలో ఎన్నికల హోరు