ఏపీలో వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి(ysr Kapu Nestam scheme) సంబంధించి రెండో ఏడాది నిధులు నేడు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్(cm jagan) నిధులు విడుదల చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తారు.
ysr Kapu Nestam: నేడు వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాపు నేస్తం పథకం(ysr Kapu Nestam scheme) రెండో ఏడాది నిధులను నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు.
ysr-kapu-nestam-scheme-2-year-founds-release-on-tomorrow
అర్హులైన 3లక్షల 27వేల 244 మంది పేద మహిళలకు.. 490.86 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నారు. అయితే కొన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమచేసుకుంటున్నాయన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ. 75 వేల సాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.