పంట నష్టపోతే బీమా పరిహారం ఆదుకొంటుందన్న నమ్మకం రైతుల్లో పెంచేందుకే వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... 12వందల 52 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు సైతం పరిహారం అందిస్తున్నామన్నారు. రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్ము అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు.
ఏపీ రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్ల పంటల బీమా సొమ్ము - ఏపీ తాజా వార్తలు
వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.1,252 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు పరిహారం అందించనున్నారు.
![ఏపీ రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్ల పంటల బీమా సొమ్ము ఏపీ రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్ల పంటల బీమా సొమ్ము](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9883944-403-9883944-1608016688149.jpg)
ఏపీ రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్ల పంటల బీమా సొమ్ము
రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్న సీఎం.. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని..గ్రామ సచివాలయాలతో ఆర్బీకేలను అనుసంధానించామన్నారు. ఆర్బీకే పరిధిలోని ఇ-క్రాపింగ్ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:రజనీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఇదేనా?