తెలంగాణ

telangana

ETV Bharat / city

సెప్టెంబరు 11న వైఎస్‌ఆర్‌ ఆసరా... డ్వాక్రా రుణాల్లో తొలివిడత చెల్లింపు - వైఎస్‌ఆర్‌ ఆసరా తాజా వార్తలు

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతగా రూ.6,792 కోట్లు మాఫీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మాఫీ సొమ్మును నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. నాలుగు విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని ఏపీ సీఎం జగన్‌ గతంలో హామీ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ ఆసరా
వైఎస్‌ఆర్‌ ఆసరా

By

Published : Jul 10, 2020, 11:55 AM IST

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతను మాఫీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాలుగు విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 9,33,183 సంఘాల సభ్యులకు రూ.27,168 కోట్ల రుణం ఉన్నట్లు అధికారులు గతేడాది గుర్తించారు. మొదటి విడతగా రూ.6,792 కోట్లు చెల్లించాలి. ఈ పథకాన్ని సెప్టెంబరు 11న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

మాఫీ చేయనున్న సొమ్మును నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయనుంది. ఇందుకోసం వారి కులం, ఉపకులం వారీగా వివరాలు తీసుకుంటున్నారు. జులై నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ABOUT THE AUTHOR

...view details