YS Viveka Murder Case transfer: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మేజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్.. నలుగురి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.
నిందితుల రిమాండ్ పొడిగింపు..