వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైకాపా ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు.
అమ్మ రాజీనామా: కొడుకు పార్టీ నుంచి కూతురు పార్టీలోకి.. - YS Vijayamma resign news
జలకళ సంతరించుకున్న జలాశయాలు
13:02 July 08
అమ్మ రాజీనామా: కొడుకు పార్టీ నుంచి కూతురు పార్టీలోకి..
‘‘కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి’’ అని ఆమె అన్నారు.
ఇవీ చూడండి..
Last Updated : Jul 8, 2022, 1:56 PM IST