ప్రతి మంగళవారం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం గత కొన్ని వారాలుగా చేపడుతోన్న ఒక్కరోజు దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగా నేడు గజ్వేల్ నియోజకవర్గంలోని గుండన్నపల్లిలో షర్మిల... నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
రాజు కుటుంబానికి భరోసా...
ముందుగా... గజ్వేల్ మండలం, అంతరావుపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజు తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం... ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ రహదారి కుందనపల్లి శివారులో షర్మిల దీక్షలో కూర్చున్నారు. దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో యువత పెద్దఎత్తున భాగస్వామ్యులయ్యారు.