YS Sharmila tweet: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తెరాస ఎమ్మెల్యేల ఫిర్యాదుపై వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు. తనపై చర్యలకు ఉపక్రమించే ముందు పరాయి ఆడదాన్ని, మరదలంటూ.. తోటి మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్, నిరంజన్రెడ్డిలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
YS Sharmila tweet: తనను, తోటి మహిళలను అవమాన పరిచిన మంత్రి నిరంజన్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ మాట్లాడిన ప్రసంగాలను ట్విటర్ ద్వారా వీడియో పోస్ట్ చేశారు. కేటీఆర్‌పై సైతం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్
తనను, తనతోటి మహిళలను అవమాన పరిచిన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోషల్ మీడియా ద్వారా కోరారు. కేసీఆర్ మాట్లాడని ప్రసంగాన్ని షేర్ చేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగళవారం తాను చేస్తున్న నిరుద్యోగ దీక్షను.. వ్రతాలంటూ కించపరిచిన మంత్రి కేటీఆర్‌పై సైతం చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: