తెలంగాణ

telangana

ETV Bharat / city

Ys Sharmila: నల్గొండ జిల్లాలో వైఎస్​ షర్మిల పర్యటన..! - Ys Sharmila latest news

వైఎస్ షర్మిల ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్టు సమాచారం. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను షర్మిల తెలుసుకోనున్నారు. దాడ సమీపంలోని దొండపాడులో వైఎస్‌ఆర్‌ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు.

Ys Sharmila Tour in Nalgonda Today
Ys Sharmila Tour in Nalgonda Today

By

Published : Jun 16, 2021, 4:57 AM IST

వైఎస్ షర్మిల ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారని షర్మిల కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు లోటస్‌పాండ్‌ నుంచి వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు.

10:30 గంటలకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. 12:45 గంటలకు హుజూర్‌నగర్‌ సర్కిల్​లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించనున్నారు. 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్‌ఆర్‌ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి బయల్దేరనున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.

ఇదీ చూడండి: CJI: సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్​... రాజ్​భవన్​లో మొక్క నాటిన జస్టిస్ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details