తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Sharmila hunger strike : 'పంట మార్పిడి అంటే మంత్రులను మార్చినంత సులభమా?'

YS Sharmila Raithu Vedana Deeksha: వరి ధాన్యం కొనుగోలు చేయనని చెప్పిన కేంద్రంపై దిల్లీలో పోరాడాల్సిందిపోయి.. రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) మండిపడ్డారు. పంటలు మార్చమని చెబుతున్నారని.. పంట మార్పిడి అంటే.. మంత్రులను మార్చినంత సులభమా అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 72 గంటలపాటు రైతు వేదన నిరాహార దీక్ష(Raithu Vedana Deeksha) చేపట్టారు.

YS Sharmila hunger strike
YS Sharmila hunger strike

By

Published : Nov 13, 2021, 12:37 PM IST

Updated : Nov 13, 2021, 12:54 PM IST

రాష్ట్రంలో ధర్నాలు(TRS dharna) చేసి ఎవరిని ఉద్ధరించారని ముఖ్యమంత్రి కేసీఆర్​(Telangana CM KCR)ను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement) చేయడం చేతకాక.. ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు మేలు జరగాలంటే.. ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలో కాదని.. దిల్లీలో పోరాడాలని సూచించారు. రైతులను పంట మార్పిడి చేయమంటున్న కేసీఆర్.. పంట మార్పిడి అంటే.. మంత్రులను మార్చినంత సులభం అనుకుంటున్నారా అని షర్మిల అడిగారు.

రాష్ట్రప్రభుత్వమే ధాన్యం కొనుగోలు(paddy procurement in telangana) చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YSRTP chief YS Sharmila) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద షర్మిల రైతు దీక్ష(YS Sharmila Raithu Vedana Deeksha)) చేపట్టారు. 72 గంటల పాటు 'రైతు వేదన' నిరాహార దీక్ష చేపట్టిన ఆమె.. రాష్ట్ర రైతులకు అండగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. సాయంత్రం 6 వరకు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయనున్న షర్మిల... లోటస్‌పాండ్‌లో(Sharmila strike at lotus pond)ని పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్ష కొనసాగించనున్నారు.

"వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్నం పెట్టే రైతన్న నోట్ల సున్నం కొడుతున్నారు. రాష్ట్ర రైతులు వరి పండించి ఆ వడ్లు అమ్మడానికి తిప్పలు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ కుప్పలు పోస్తూ.. ఎండాచలికి తొణకకుండా ఆ కుప్పలపై కుప్పకూలుతున్నారు. తెలంగాణ సర్కార్ వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రం కొనుగోలు చేయమని చెప్పినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్లు పెట్టిన ఆంక్షలను ఒప్పుకుని ఎందుకు సంతకాలు పెట్టారు? భాజపా సర్కార్​కు కేసీఆర్ ఎందుకు ఏజెంట్​గా మారారు? ఆంక్షలు పెట్టినప్పుడే.. దిల్లీలో పోరాడాల్సింది కదా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ధర్నాలు చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నారు?"

- షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని షర్మిల(YSRTP chief YS Sharmila) అన్నారు. ఉచిత విద్యుత్, ఇన్​పుట్ సబ్సిడీ, పంట బీమా, విత్తనాల సబ్సిడీలతో కర్షకులకు ఆర్థిక భారాన్ని తగ్గించారని తెలిపారు. పెట్టుబడి తగ్గించి.. రాబడి పెంచారని అందుకే రాజన్న కాలంలో.. రైతు రాజయ్యాడని చెప్పారు. ముఖ్యమంత్రి పనితనమంటే అది అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యాన్ని మద్దతు ధరపై బోనస్(bonus on paddy) ఇచ్చి కొనుగోలు చేశారని షర్మిల వివరించారు. సన్నవరి పండించడానికి రైతులు చాలా కష్టపడాల్సి వస్తుందని.. అందుకే ఆ వరి పండించే రైతులకు మద్దతు ధరపై రూ.300లు బోనస్ ఇచ్చారని తెలిపారు.

Last Updated : Nov 13, 2021, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details