ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను సీఎం కేసీఆర్ బలితీసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆమె చేసిన 72 గంటల ఉద్యోగ దీక్ష విరమించారు. ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ... షర్మిల 72 గంటల దీక్షకు పూనుకున్నారు.
తెలంగాణలో రెండేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం : షర్మిల - ys sharmila hunger strike in Hyderabad
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో చేసిన 72 గంటల ఉద్యోగ దీక్షను విరమించారు. ఉద్యోగ నోటిపికేషన్లు విడుదల చేయకుంటే వచ్చే రెండేళ్లలో తమ ప్రభుత్వమే అధికారంలోకి షర్మిల వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
![తెలంగాణలో రెండేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం : షర్మిల ys sharmila, ys sharmila strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11447350-1000-11447350-1618730743651.jpg)
మొదటి రోజు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయగా... పోలీసులు అడ్డుకుని షర్మిలను.... ఆమె నివాసానికి తరలించారు. జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. ఆరోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ నోటిపికేషన్లు విడుదల చేయకుంటే వచ్చే రెండేళ్లలో తమ ప్రభుత్వమే అధికారంలోకి షర్మిల వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు నిరుద్యోగ నిర్మూలన చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఒవర్ మీద నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు అడ్డుకుని నా చేతిని విరగొట్టారని...ఆడవాళ్ల మీదనా మీ ప్రతాపమంటూ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆర్డర్‌ను ఫాలో అయ్యేందుకే పోలీసులు ఉన్నారా అంటూ నిలదీశారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలు దీక్షలు చేస్తారని ఆమె వెల్లడించారు.
- ఇదీ చదవండి :మంత్రుల పర్యవేక్షణ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు