తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమరావతి రైతుల కోసం వైఎస్ షర్మిల పోరాడాలి' - Amaravati

నిరుద్యోగుల కోసం తెలంగాణలో ఆందోళన చేస్తున్న షర్మిల... అమరావతి అన్నదాతల కోసం పోరాడాలని రైతులు డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయ్యాక ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని అన్నారు. రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలంటూ మహిళలు, రైతులు నినాదాలు చేశారు.

ys sharmila, amaravathi farmers protests
వైఎస్​ షర్మిల, అమరావతి రైతుల పోరాటం

By

Published : Apr 21, 2021, 6:10 PM IST

రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలంటూ.. ఆంధ్రప్రదేశ్​లోని అమరావతిలో మహిళలు, రైతులు నినాదాలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏపీ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు 491వ రోజు ఆందోళనలు చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని అన్నారు. నిరుద్యోగుల కోసం తెలంగాణలో ఆందోళన చేస్తున్న షర్మిల.. అమరావతి రైతుల కోసం ఇక్కడికి వచ్చి పోరాడాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తెల్లారకుండానే క్యూ కడుతున్న ఆధార్​ కార్డులు, వాటర్​ బాటిళ్లు..

ABOUT THE AUTHOR

...view details