తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Sharmila Padayatra: నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర పునఃప్రారంభం - షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

YS Sharmila Padayatra: ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు వైతెపా అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న తాత్కాలికంగా వాయిదా పడిన ఈ యాత్రను.. కొండపాక గూడెం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.

YS Sharmila Prajaprasthana Yatra resumes from tomorrow
YS Sharmila Prajaprasthana Yatra resumes from tomorrow

By

Published : Mar 10, 2022, 9:08 PM IST

Updated : Mar 11, 2022, 12:56 AM IST

YS Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయ‌స్ ష‌ర్మిల ప్రజాప్రస్థానం పేరిట తలపెట్టిన పాదయాత్ర తిరిగి నేటి నుంచి ప్రారంభించనున్నారు. 21 రోజుల పాటు సాగిన పాదయాత్ర.. వాయిదాపడిన ప్రాంతం.. నార్కట్​ప‌ల్లి మండ‌లం కొండ‌పాక‌గూడెం నుంచే పాద‌యాత్ర కొనసాగనుంది.

రేపటి పాదయాత్ర షెడ్యూల్..

లోటస్ పాండ్​లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు చిన్న నారాయణపురం, 5 గంటలకు నార్కెట్​పల్లి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు మడఎడవెల్లికి చేరుకుంటారు. 6 గంటల 45 నిమిషాలకు పోతినేనిపల్లి క్రాస్​కు చేరుకుని.. ప్రజలతో మాట్లాడతారు. పోతినేనిపల్లిలోనే రాత్రి బసచేస్తారు.

21 రోజులు.. 237.4 కిలోమీటర్లు..

దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే వైయస్ షర్మిల కూడా ప్రజాప్రస్థానం పాద‌యాత్రను ప్రారంభించారు. 2021 అక్టోబర్ 20న చేవెళ్లలో వైయస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించి.. పాదయాత్రలో తొలిఅడుగు వేశారు. దాదాపు 21 రోజుల పాటు పాదయాత్ర కొన‌సాగింది. మ‌ధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. 2021 నవంబరు 9వ పాదాయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ 21 రోజుల‌లో మొత్తం 237.4 కిలోమీట‌ర్లు ష‌ర్మిల పాదయాత్ర చేశారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాలలో.. 15 మండ‌లాలు.. 5 మున్సిపాలిటీలు.. 122 గ్రామాల్లో ప‌ర్యటించారు. నిరుద్యోగుల కోసం ప్రతి మంగ‌ళ‌వారం దీక్ష చేశారు. నవంబర్​ 9న పాద‌యాత్ర తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పుడు ఆగిపోయిన పాదయాత్రను తిరిగి రేపటి నుంచి ప్రారంభిస్తారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 11, 2022, 12:56 AM IST

ABOUT THE AUTHOR

...view details