ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తా: వైఎస్ షర్మిల - ఖమ్మంలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన
17:49 March 16
ఖమ్మం వేదికగా లక్ష మంది సమక్షంలో షర్మిల సమర శంఖం!
ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల... లక్ష మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని ఉద్ఘాటించారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికే పార్టీ పెడుతున్నానని పేర్కొన్నారు. తాను తెరాసకో లేక భాజపాకో బి టీమ్ కాదన్నారు.
ఖమ్మం వేదికగానే సమర శంఖం పూరిద్దామని వైఎస్ అభిమానులకు షర్మిల మాటిచ్చారు. పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై నేతలకు వివరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలను అభిమానులు కోరినట్లు సమాచారం.