తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో వైఎస్ లోటు కనిపిస్తోంది: షర్మిల - Sharmila meets ycp leaders at lotuspond in Hyderabad

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో అభిమానులు, వైకాపా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోటస్​పాండ్​లో సందడి వాతావరణం కనిపించింది.

Sharmila meets ycp leaders at lotuspond in Hyderabad
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

By

Published : Feb 9, 2021, 12:47 PM IST

Updated : Feb 9, 2021, 2:45 PM IST

తెలంగాణలో వైఎస్ లోటు కనిపిస్తోంది

తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్​లోని తన నివాసంలో అభిమానులు, వైకాపా నేతలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

'వైఎస్సార్‌ అభిమానులారా తరలి రండి'.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్‌ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్‌ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్‌ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు.

అభిమానులతో మాట్లాడిన అనంతరం షర్మిల.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. రోజుకో జిల్లా చొప్పున.. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకే ఈ సమావేశాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :షర్మిల పార్టీపై మంత్రి గంగుల గరంగరం

Last Updated : Feb 9, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details