వైఎస్ షర్మిల పార్టీ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నిక సంఘానికి... షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ"పేరుతో దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ఈ ఆమోదం తెలిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
YS Sharmila: వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఖరారు..! - వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదేనంటూ... వార్తలు గుప్పుమంటున్నాయి. "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ" పేరుతో ఇప్పటికే ఖరారైన్నట్టు తెలుస్తోంది. సీఎస్ఈ ఆమోదం తెలిపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ys sharmila new party name announced as ysr telangana party
వైఎస్సార్టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఈ పార్టీపై ఎవరికైనా... అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16లోపు తెలపాలని మార్చిలో ఎన్నికల సంఘం నోటిసు ఇచ్చింది. అయితే ఇది ఎంత వరకు నిజం అన్నది తెలుసుకోవాలంటే... వైఎస్ షర్మిల స్వయంగా పార్టీ పేరు ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.