రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రూ. లక్షన్నర చొప్పున పరిహారం ఇప్పించారని వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ రైతుల కష్టాలు చూసే.. ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చారని తెలిపారు.
'కరీంనగర్ కమాన్ నుంచి చూస్తే.. ప్రజల నాడి తెలుస్తుంది'
కరీంనగర్ రైతుల కష్టాలు చూసే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చారని వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాను రైస్ బౌల్ అనడానికి రాజశేఖర్ రెడ్డినే కారణమని తెలిపారు. ఆ జిల్లా వాసులతో వైఎస్ఆర్కు విడదీయరాని బంధం ఉందని చెప్పారు. కరీంనగర్ కమాన్ వద్ద నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందని పేర్కొన్నారు.
సిటీ ఆఫ్ ఎనర్జీ.. రామగుండం.. సింగరేణి రాష్ట్రానికి తలమానికమని షర్మిల అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర చేసిన నేతన్నలు కనిపిస్తారని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.