తెలంగాణ

telangana

ETV Bharat / city

YS SHARMILA: ఏపీ సీఎం జగన్​కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన షర్మిల - raksha Bandhan celebrations at ysrtp office

రాఖీపౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం జగన్​ సహా.. పార్టీ కార్యకర్తలు, నేతలకు.. వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని... కార్యకర్తలకు రాఖీలు కట్టారు.

ys sharmila
ys sharmila

By

Published : Aug 22, 2021, 3:15 PM IST

Updated : Aug 22, 2021, 3:34 PM IST

వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్​ లోటస్​పాండ్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు.. అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్​ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్​ చేశారు.

'నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్​ చేశారు.

నిరుద్యోగుల అంశంపై తమ పార్టీ మొదటి నుంచి దీక్షలు చేస్తోందని, హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో వందకుపైగా నిరుద్యోగ అభ్యర్థులను బరిలో దించుతామని.. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు.

ఇదీచూడండి:RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Last Updated : Aug 22, 2021, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details