agnipath scheme : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ సర్వీసును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుండగా... ఆ నిరసన సెగ ఇప్పుడు హైదరాబాద్‌కు తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. రైలు బోగిలకు నిప్పుపెట్టడంతోపాటు... స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఆందోళనకారుల నిరసనలతో... సికింద్రాబాద్ ప్రాంగణం అట్టుడికిపోయింది.
అగ్నిపథ్ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి యువకులు రాత్రే హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని ఆందోనకారులు యువతకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లాల వారీగా ఆందోనకారులు వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకు ఆందోళనకారులు నిన్న రాత్రే వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్ బయట ఓ బస్సు అద్దాలు పగుల గొట్టి.. ఉదయం 9 గంటల వేళ ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకొచ్చినట్లు చెప్పారు.
protest against agnipath scheme : కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు... రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.