తెలంగాణ

telangana

ETV Bharat / city

midnight dances in Vijayawada: బ్యారేజ్​పై బర్త్​డే పార్టీ.. తప్పతాగి అర్ధరాత్రి హల్​చల్ - విజయవాడ తాజా వార్తలు

midnight dances in Vijayawada: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్​పై అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ యువకులు హల్​చల్ చేశారు. మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేసి, బ్యారేజ్​పై ఫొటోలు, వీడియోలు దిగారు.

midnight dances in Vijayawada
అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు

By

Published : May 5, 2022, 6:18 PM IST

midnight dances in Vijayawada: ఏపీలో ప్రకాశం బ్యారేజ్​పై అర్ధరాత్రి యువకులు రెచ్చిపోయారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ హల్​చల్ చేశారు. నగరానికి చెందిన యువకులు అర్ధరాత్రి బ్యారేజ్​పై కారు ఆపి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేసి, బ్యారేజ్​పై ఫొటోలు, వీడియోలు దిగారు. కారులో పెద్ద సౌండ్స్​తో పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు.

బర్త్​డే పార్టీలో అర్ధరాత్రి హల్​చల్.. తప్పతాగి బ్యారేజ్​పై చిందులు

తాడేపల్లి పోలీసులు ఈ వీడియోలో ఉన్న యువకులపై ఆరా తీస్తున్నారు. ఐదుగురు యువకులు గాంధీనగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. అర్ధరాత్రి యువకులు బ్యారేజ్​పై హల్​చల్ చేసినా రాత్రి పెట్రోలింగ్ పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడకపోవటం విమర్శలకు దారి తీస్తోంది.

ABOUT THE AUTHOR

...view details