ఓ యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న పుష్కరిణి నృసింహ సాగరానికి వరద నీరు భారీగా చేరడంతో గండి పడింది. అయితే గండి పడిన ప్రదేశాన్ని యువకుడు దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయాడు. వరద నీటిలో ఉన్న పిల్లర్ సహాయంతో అతికష్టం మీద బయటకు వచ్చాడు.
వరదలో చిక్కిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం - పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న పుష్కరిణి
ఏపీలోని ద్వారకా తిరుమల శ్రీవారి నరసింహ సాగర్లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు పడిపోయాడు. కొంత దూరం కొట్టుకుపోయాక సిమెంట్ పిల్లర్ సాయంతో బయటపడ్డాడు.
వరదలో చిక్కిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం