తెలంగాణ

telangana

ETV Bharat / city

పచ్చదనం కోసం సైకిల్​పై దేశయాత్ర

'పచ్చదనాన్ని పెంచండి... కాలుష్యాన్ని నివారించండి' అంటూ కేరళకు చెందిన యువకుడు సైకిల్​పై తిరుగుతూ ప్రచారం కల్పిస్తున్నాడు. దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలని సంకల్పించి.. డిసెంబర్ 16న తన ప్రయాణాన్ని కేరళ నుంచి ప్రారంభించాడు. నేడు ఏపీలోని అనంతపురం చేరుకున్నాడు.

పచ్చదనం కోసం సైకిల్​పై దేశయాత్ర
పచ్చదనం కోసం సైకిల్​పై దేశయాత్ర

By

Published : Dec 25, 2020, 2:28 PM IST

దేశం మెుత్తం సైకిల్​పై చుట్టిరావాలనుకున్నాడు. అనుకున్న వెంటనే యాత్ర ప్రారంభించాడు కేరళకు చెందిన గోకుల్. డిసెంబర్ 16న కేరళలో మెుదలుపెట్టి... నేడు ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండలోకి ప్రవేశించాడు.

తాను ప్రతిరోజూ 100 కిలోమీటర్ల వరకు సైకిల్ ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు. ఇప్పటి వరకు 700 కిలోమీటర్ల ప్రయాణం దిగ్విజయం కొనసాగించానని తెలిపాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సైకిల్​ తొక్కుతూ...రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోని దేవాలయాల్లో నిద్రిస్తూ....తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. పచ్చదనం పెంచడం, కాలుష్యాన్ని నివారించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ..అవగాహన కల్పిస్తున్నాడు.

ఇవీచూడండి:హైదరాబాద్​ టూ దిల్లీకి సైక్లింగ్​.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details