సరూర్నగర్ వరద నీటిలో యువకుడు గల్లంతు! - డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు
స్కూటీపై వెళ్తూ.. వరద నీటిలో పడి యువకుడు కొట్టుకుపోయిన ఘటన బాలాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. తపోవన్ కాలనీ వద్ద కాసేపు నిరీక్షించిన యువకుడు వరద నీటిలోంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అదుపు తప్పి నీటిలో కొట్టుకుపోయాడు.

తపోవన్ కాలనీ వైపు స్కూటీపై వెళ్తూ.. అదుపు తప్పి వరద నీటిలో యువకుడు కొట్టుకుపోయాడు. వరద తగ్గుతుందేమో అని కొద్దిసేపు నిరీక్షించిన యువకుడు.. ఒక్కసారిగా స్కూటీ వేగం పెంచి వరద నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించాడు. స్కూటీ అదుపు తప్పి వరద నీటిలో పడి యువకుడు గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గల్లంతైన వ్యక్తి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. సదరు యువకుడు కొట్టుకుపోయిన వరద నీరు దాదాపు ముప్పై ఐదు కాలనీల నుంచి వస్తుందని.. అదంతా.. సరూర్ నగర్ చెరువులో కలుస్తోందని స్థానికులు చెప్తున్నారు.