దుబ్బాకలో జరిగిన తనిఖీల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు నాంపల్లిలోని భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన శ్రీను... ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
'బండి సంజయన్నపై చెయ్యేస్తే సహించేది లేదు' - suicide attempted to suicide for bandi sanjay
బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ... ఓ యువకుడు నాంపల్లిలోని భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా... అక్కడే ఉన్న స్థానికులు మంటలార్పి కాపాడారు.
'బండి సంజయన్నపై చేయ్యేస్తే సహించేది లేదు'
వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. బండి సంజయ్‌పై చేయి వేస్తే సహించేది లేదని యువకుడు హెచ్చరించాడు. ఘటన జరిగిన సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేశానని తెలిపాడు. పోలీసులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు.