తెలంగాణ

telangana

ETV Bharat / city

Metro Dance Viral: మెట్రో స్టేషన్​లో అమ్మాయి క్రేజీ డాన్స్​.. టాక్​ ఆఫ్​ టౌన్​గా వీడియో.. - tending reels

Metro Dance Viral: ఇల్లు, స్కూలు, గుడి, బడి, ఆఫీస్​, రెస్టారెంట్​... ఇలా ప్లేస్​ ఏదైనా పర్లేదు.. ట్రెండింగ్​లో ఉన్న పాటకు నాలుగు స్టెప్పులేశామా.. దాన్ని క్రేజీగా వీడియో తీశామా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టేశామా.. ఇది ఇప్పుడు నడుస్తోన్న రీల్స్​ ట్రెండ్​. అలా ట్రెండ్​ ఫాలో అవుతూ.. ట్రెండింగ్​లో ఉన్న పాటకు స్టెప్పులేసిన ఓ అమ్మాయి ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఇదంతా ఆమె తీసిన వీడియోనో.. చేసిన డాన్స్​ వల్లో కాదు.. ఇదంతా జరిగిన ప్లేస్​ వల్లే మరి..!!

young-lady-dances-in-metro-station-goes-viral-in-youtube-short-video
young-lady-dances-in-metro-station-goes-viral-in-youtube-short-video

By

Published : Jul 20, 2022, 4:36 PM IST

Updated : Jul 20, 2022, 5:20 PM IST

మెట్రో స్టేషన్​లో అమ్మాయి క్రేజీ డాన్స్​.. టాక్​ ఆఫ్​ టౌన్​గా వీడియో..

Metro Dance Viral: యూట్యూబ్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రాం.. ఇలా ఏది ఓపెన్​ చేసినా కుప్పలు తెప్పలుగా.. రీల్స్​, షార్ట్​ వీడియోలే. క్రేజీగా ఉండే ఆ షార్ట్​ వీడియోలను చూస్తూ పోతే.. సమయం, ఇంటర్​నెట్​ డాటా రెండూ ఇట్టే కరిగిపోతుంటాయి. అటు చూసేవాళ్లు కూడా షార్ట్​ అండ్​ స్వీట్​గా ఉండే వీడియోలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం.. తీసేవాళ్లకూ పెద్ద కష్టంగా లేకపోవటం.. మొత్తానికి రీల్స్​కి మార్కెట్​లో క్రేజీ డిమాండ్​ ఉంది. అయితే.. వీక్షకులకు ఆనందం పంచాలన్న తాపత్రయమో.. లేదా బాగా లైకులు, షేర్లు సంపాదించి ఫేమస్​ అయిపోవాలని తపనో గానీ.. యువత మాత్రం వీటి కోసం బాగానే చెమటోడుస్తున్నారు. అందులో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతే.. మరికొందరు మాత్రం లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటూ చిక్కుల్లో పడుతున్నారు. ఇలా రీల్స్​ కోసం ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంమైంది.

యువత తమ రోజువారి కార్యక్రమాల్లో కొంచెం సమయం దొరికినా.. రీల్స్​ చేస్తూ, చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కడున్నా సరే.. తమకు నచ్చిన పని చేస్తూ.. షార్ట్​ వీడియోలు తీసుకుంటున్నారు. అలా.. ఓ యువతి చేసిన రీల్స్​ వ్యవహారం ఇప్పుడు తెగ వైరల్​ అవుతోంది. నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే మెట్రో రైల్వేస్టేషన్‌లో.. ట్రైన్​ కోసం అమ్మాయి ఎదురుచూస్తోంది. సమయం వృథా చేయటం ఎందుకని.. ఈ గ్యాప్​లో ఓ రీల్​ చేసేస్తే పోలా.. అనుకుంది. వెంటనే.. ట్రెండింగ్​లో ఉన్న పాటను ఎంచుకుని.. బీట్​కు తగ్గట్టు ఉర్రూతలూగించే రీతిలో డ్యాన్స్​ చేయటం మొదలుపెట్టింది. ఆమె చేస్తున్న డ్యాన్స్​ను తన స్నేహితులు రికార్డు చేస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఆశ్చర్యంతో చూడటం అక్కడున్న వాళ్లు వంతైంది.

ఇక్కడివరకు అంతా బాగానే ఉండగా.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇంకేముంది.. ఇప్పటివరకు మెట్రో స్టేషన్లలో ఇలా డాన్స్​ చేస్తూ.. రీల్స్​ ఎవరూ చేయకపోవటంతో ఈ వీడియో బాగానే వైరల్​ అయ్యింది. అందులోనూ.. ఆమె డ్యాన్స్​ చేసిన పాట కూడా ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉండటం వల్ల మరింత దూసుకుపోయింది. ఇది కాస్తా.. కొందరికి నచ్చకపోవటంతో మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. జనం ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో ఇలా చేయటం వల్ల.. మిగతావారికి ఇబ్బంది కలుగుతోందని కంప్లైంట్​ రావటంతో.. అధికారులు స్పందించారు.

మెట్రోస్టేషన్లు, రైళ్లలో న్యూసెన్స్​ చేస్తూ... ప్రయాణికులను ఇబ్బంది పెట్టే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియో చేసిన యువతీపై మెట్రో అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ యువతి ఎవరు...? ఏ స్టేషన్‌లో నృత్యం చేసిందో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 20, 2022, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details