గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: యుగ తులసి ఛైర్మన్ - youga tulasi chairman shivakumar latest news
![గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: యుగ తులసి ఛైర్మన్ youga tulasi chairman shivakumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13142840-323-13142840-1632328070840.jpg)
21:44 September 22
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: యుగ తులసి ఛైర్మన్
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తితిదే చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని యుగ తులసి ఛైర్మన్, తితిదే పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు కే శివ కుమార్ డిమాండ్ చేశారు. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 4గం.లకు తిరుపతి శ్రీ తారకరామ స్టేడియంలో గో మహా సమ్మేళనం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్‌ను శివ కుమార్ దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించారు.
ఇదీ చదవండి:KTR: 80 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం