తెలంగాణ

telangana

ETV Bharat / city

Raghu rama: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్​తో ఎంపీ రఘురామ భేటీ - దిల్లీలో రాజ్​నాథ్ సింగ్​ను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీలో.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. సుమారు పదినిమిషాల పాటు రాజ్​నాథ్​తో భేటీ అయ్యారు.

YCP MP RRR meet Rajnath Singh
YCP MP RRR meet Rajnath Singh

By

Published : May 30, 2021, 2:22 PM IST

రాజద్రోహం కేసులో బెయిల్‌పై ఉన్న ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సుమారు పది నిమిషాలు రాజ్‌నాథ్‌తో సమావేశం అయ్యారు.

బెయిల్‌ లభించిన తర్వాత దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులను కలిసిన ఎంపీ రఘురామ... అక్కడ కాళ్లకు పిండికట్లు వేయడంతో... నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్లే సమయంలో కారు ఎక్కేందుకూ చక్రాల కుర్చీ వినియోగించారు.

ఇవీచూడండి:Raghurama: సీఎం కేసీఆర్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ABOUT THE AUTHOR

...view details