అమరావతి నుంచి విశాఖకు మొత్తంగా రాజధానిని తరలించాలని చూస్తున్నారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. రాజధాని తరలింపుపై బాహాటంగానే ప్రభుత్వ వైఖరిని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసినందుకు కొడాలి నానికి అభినందనలన్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీపై రైతులకు సందేహాలు, అపోహలు ఉన్నాయని చెప్పారు.
విద్యుత్ వినియోగంపై లెక్క ఉండాలని కేంద్రం చెప్పిందన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మీటర్ల పెట్టి వాటికి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం కడపలో మొదలుపెట్టాలని ఎంపీ కోరారు.