తెలంగాణ

telangana

ETV Bharat / city

దొంగ మద్యం ఏరులైపారుతోంది: ఎంపీ

ఆంధ్రప్రదేశ్​లో గతంలో కంటే మద్యం అమ్మకాలు పెరిగాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదాయం పెంచుకోవడానికి మద్యాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యంపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రకులాల్లో పేదలను సీఎం దృష్టిలో ఉంచుకోని కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ycp-mp-raghurama-krishnam-raju-comments-on-liquor-sales-in-ap
దొంగ మద్యం ఏరులైపారుతోంది: ఎంపీ

By

Published : Oct 29, 2020, 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దొంగ మద్యం ఏరులైపారుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదాయం పెంచుకోవడానికి మద్యాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనధికారిక మద్యం గొలుసు దుకాణాలు ఎక్కువయ్యాయన్నారు.

గతంలో కంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్న ఆయన... ఆరోగ్యం పాడవకుండా మంచి మద్యం దొరికేలా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. సంపూర్ణ మద్య నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం వ్యాపారులపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తోంది. ఉన్నతస్థాయి కులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారు ఎక్కువగా ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. అగ్రకులాల్లో పేదలను ఏపీ సీఎం దృష్టిలో ఉంచుకోవాలి. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి' - రఘురామకృష్ణరాజు, ఎంపీ

ఇదీ చదవండి :వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details