వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ప్రశ్నించారు. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Raghurama letter: 'ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి' - తెలంగాణ వార్తలు
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. క్విడ్‌ప్రోకో, సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని వివరిస్తూ.. రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు పేర్కొన్నారు.
ఎంపీ రఘురామ లేఖ, విజయసాయిరెడ్డిపై రఘురామ ఆగ్రహం
ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఏ-2 స్థాపించిన సూట్ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయన్నారు. క్విడ్‌ప్రోకో, సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు రఘురామ చెప్పారు. ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి.:సింగరేణి ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం