తెలంగాణ

telangana

ETV Bharat / city

మా పార్టీ వాళ్లు నన్ను వెలివేశారు: రఘురామకృష్ణరాజు - mp raghu rama krishnam raju met jp nadda

ఆంధ్రప్రదేశ్​ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ వాళ్లు తనను వెలివేశారని అన్నారు. దిల్లీలో జె.పి.నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపైనా నడ్డాతో చర్చించానని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

ycp-mp-raghu-rama-krishnam-raju-sensational-comments
మా పార్టీ వాళ్లు నన్ను వెలివేశారు: రఘురామకృష్ణరాజు

By

Published : Jul 18, 2020, 4:50 PM IST

సొంత పార్టీ వాళ్లే తనను వెలి వేశారని ఆంధ్రప్రదేశ్​ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయినా సీఎంకు, పార్టీకి తానెప్పుడూ విధేయుడినేనని పునరుద్ఘాటించారు. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాను దిల్లీలో కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు... అరగంటసేపు సమావేశమయ్యారు. అనంతరం మీడియాకు భేటీ విషయాలను వెల్లడించారు.

సబార్టినేట్ లెజిస్లేటివ్ కమిటీ ఛైర్మన్‌గా వివిధ అంశాలపై చర్చించా. లాక్‌డౌన్‌ వల్ల 3 నెలలు కమిటీ సమావేశాలు నిర్వహించలేదు. ఈ నెల 29 నుంచి కమిటీ సమావేశాలు జరుపుతాం. ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై పార్టీల నేతలను కలుస్తున్నా. అందుకే భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశా. కమిటీ అంశాలతోపాటు రాష్ట్ర రాజకీయాలపైనా చర్చించాం. వాటిని మాత్రం బయటకు చెప్పలేను. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి నాకు తెలియదు. నాకు మాత్రం భద్రత లేదు. లాక్‌డౌన్ వల్ల 3 నెలలపాటు హైదరాబాద్‌లోనే ఉండిపోయా. అయినా దిష్టిబొమ్మలు తగలబెట్టానని నాపై కేసులు పెడుతున్నారు. లోక్‌సభలో నా స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ లేదు. నన్ను మరో మెట్టు పైకి ఎక్కించారనే అనుకుంటున్నా- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

ఇదీ చదవండి :మావోయిస్టులు బెదిరించి వసూళ్లు చేస్తున్నారు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details