తెలంగాణ

telangana

ETV Bharat / city

పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ - ycp mp raghurama krishna raju news

పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. జగన్​ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు.

ycp mp raghurama krishna raju
ycp mp raghurama krishna raju

By

Published : Mar 15, 2022, 6:56 PM IST

పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ

వైకాపా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలని ఏపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. జనసేన, భాజపా, తెలుగుదేశం కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ ఆవిధంగా వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని రఘురామ తెలిపారు.

"వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్‌ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్‌ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్‌ ఉద్దేశం." - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ

ఇదీచూడండి:ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్

ABOUT THE AUTHOR

...view details