తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్​కు తిరుగుండదు' - అమరావతి రాజధాని వార్తలు

పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. ప్రజాధనం వృథా చేయటం సరికాదన్నారు. రాజధానిపై మరోసారి ఆలోచించాలని సీఎం జగన్​ను కోరారు.

'ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్​కు తిరుగుండదు'
'ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్​కు తిరుగుండదు'

By

Published : Aug 8, 2020, 5:53 PM IST

అమరావతిని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తే కొన్ని దశాబ్దాల పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు తిరుగుండదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని ఆయన తప్పుబట్టారు. కోర్టుల్లో పిటిషన్​ల కోసం ప్రజాధనం వృథా చేయటం సరికాదన్నారు.

రాజధాని మార్పుపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని... కరోనా నియంత్రణలో అలసత్వం ప్రదర్శిస్తోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏపీలో శానిటైజర్​ వల్ల మరణాలు బాధాకరమన్న ఆయన... ఈ మరణాలు ఆగాలంటే పెంచిన మద్యం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

'ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్​కు తిరుగుండదు'

ABOUT THE AUTHOR

...view details