ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధిష్ఠానం జారీ చేసినషోకాజ్ నోటీసుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 18 పేజీల నోటీసులో రెండు పేజీలు రాతపూర్వకంగా ఉంటే... మిగతా 16 పేజీలు వివిధ పత్రికా క్లిప్పింగ్లు జతపరిచానని తెలిపారు. తాను పార్టీపై, అధ్యక్షుడినిగానీ ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు కొన్నిచోట్ల సజావుగా అమలుకావట్లేదని సూచనలు చేశానని వ్యాఖ్యానించారు. సీఎం అపాయింట్‌మెంట్ దొరకనందునే మీడియా ముఖంగా తెలియజేశానని వివరించారు.
జగన్ను పల్లెత్తు మాట అనలేదు: ఎంపీ రఘురామకృష్ణరాజు - అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు
ఏపీలో వైకాపా అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తాను పార్టీపైగాని, అధ్యక్షుడినిగానీ ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశారు.
అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు
'నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప పార్టీకి కాదు. దేవాలయ భూముల విషయం, ఇతర అంశాలను సీఎంకు సూచనపూర్వకంగా తెలియజేశా. పార్టీని, అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదు, అదే వివరణ రేపు అందిస్తా. నాకు 7 రోజుల సమయం ఇచ్చినా గురువారమే సమాధానం పంపుతా' - రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి:ప్రజల భాగస్వామ్యంతో పట్టణాల రూపురేఖలు మారుస్తాం: కేటీఆర్